ఓరుగల్లులో భారీ వర్షం

ఓరుగల్లులో భారీ వర్షం

(వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ)
ఓరుగల్లులో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పుడిపుడే కుదుటపడుతున్న నగర వాసులకు భారీ వర్షం భయాందోళనకు గురి చేస్తోంది. ఇక ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద మార్కెట్ గా పేరు గాంచిన వరంగల్ (ఎనుమాముల) వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షం కారణంగా పత్తి, మొక్కజొన్నలు తడిసిపోయాయి. ముఖ్యంగా భారీ వర్షంతో పత్తి తడిసి ముద్దయ్యింది. వ్యాపారులు కొనుగోళ్ళు చేసేందుకు నిరాకరిస్తున్నారు. దాంతో పత్తి రైతుల ఆందోళనకు లోనవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్ కు తీసుకొచ్చిన తర్వాత తడిసిపోవడంతో పత్తి రైతులు కంటతడి పెడుతున్నారు.

Leave a Reply