ఆరోగ్యమస్తు..
సత్తెనపల్లి (పల్నాడు) ఆంధ్రప్రభ : ప్రతి జర్నలిస్ట్(Journalist) ఆరోగ్యంగా ఉండాలని.. అనారోగ్య సమస్యలు వస్తే ఎప్పటికప్పుడు తక్కువ ఖర్చుతో వైద్య సహాయం అందిస్తాము అని లలిత సూపర్ స్పెషాలిటీ(Lalitha Super Specialty) ఆసుపత్రి యాజమాన్యం పల్నాడు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో జిల్లాలోని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) సభ్యులకు ఆదివారం హెల్త్ కార్డుల(Health Cards)ను అందచేశారు.
ఈ హెల్త్ కార్డ్ వల్ల జర్నలిస్టులకు లలిత ఆసుపత్రిలో అన్నివిభాగాలకు ఉచిత ఓపీతో పాటు, వైద్య పరీక్షలపై 50 శాతం, కుటుంబ సభ్యులకు 30 శాతం రాయితీ లభిస్తుందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విద్యాధరణి మురళి(Vidyadharani Murali) వివరించారు. రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఎలెక్ట్రానిక్ మీడియా(Electronic Media) రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ(Yechury Shiva), గుంటూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యస్ కే మీరా, కే రాంబాబు పల్నాడు జర్నలిస్టులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
150 మంది జర్నలిస్టులకు సీనియర్ శాసనసభ్యులు (సత్తెనపల్లి) కన్నాలక్ష్మీ నారాయణ(Kannalakshmi Narayana) రెండు నియోజకవర్గాల జర్నలిస్టులకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు భువన్ దాసరి(Bhuvan Dasari), కార్యదర్శి పుల్లంశెట్టి నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కే సైదా, మాగులూరి రాంబాబు, బుజ్జిబాబు, బెన్నీ బాబు తదితరులు పాల్గొన్నారు.

