ఆయ‌న‌ను స్పూర్తిగా తీసుకోవాలి…

ఆయ‌న‌ను స్పూర్తిగా తీసుకోవాలి…

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్(Maulana Abdul Kalam Azad) జయంతి సందర్భంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ మాధురి హాజరై, మౌలానా ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాధురి(Additional Collector Madhuri) మాట్లాడుతూ.. భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య ఉద్యమంలో మాత్రమే కాకుండా విద్యారంగ అభివృద్ధికి(development of education) కూడా విశేష సేవలు అందించారని పేర్కొన్నారు.

ఆయన దూరదృష్టి ఫలితంగానే విద్యా విస్తరణకు పునాదులు వేశారని, దేశ యువత ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి విశాలాక్షి, డీఆర్వో పద్మజరాణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు, కలెక్టరేట్ సిబ్బంది, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply