కమ్మర్ పల్లి : ఎక్క‌డైనా నేరం జ‌రిగిన‌ప్పుడు.. పోలీసులు స‌హాయం కావాల్సిన వారు డ‌య‌ల్ 100 (dail 100) కాల్ (call) చేస్తారు. అయితే డ‌య‌ల్ 100 కాల్ చేసి పోలీసుల స‌మ‌యాన్ని వృథా చేసిన ఓ వ్య‌క్తికి చ‌ట్ట ప్ర‌కారం జైలుకు పంపించారు. ప్ర‌భుత్వం అత్య‌వ‌స‌ర సేవ కోసం ఏర్పాటు చేసిన ఫోన్ నెంబ‌ర్ల‌కు కాల్ చేస్తే ఇలానే జైలుకెళ్లాల్సి ఉంటుంది.

కమ్మర్ పల్లి (kammarapalli) ఎస్ఐ (si) జి.అనిల్ రెడ్డి (G.Anil Reddy) తెలిపిన వివరాల ప్రకారం…. కమ్మర్ పల్లి మండల పోలీసు స్టేషన్ పరిధిలో డయల్ 100కు ఫోన్ చేసి మిస్ యూజ్‌ చేస్తూ న్యూసెన్స్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసిన తన్నీరు వెంకటేష్ పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిందితుడు వెంక‌టేష్‌ను ఆర్మూర్ కోర్టులో హాజరు పరచగా మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ తీర్పు ఇచ్చారు.

Leave a Reply