HBD | వ‌జ్రోత్స‌వ జ‌న్మ‌దిన వేడుకలు – యూర‌ప్ లో జ‌రుపుకోనున్న చంద్ర‌బాబు

వెల‌గ‌పూడి – తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20న చంద్రబాబు డైమండ్ జూబ్లీ అంటే 75వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో విదేశాల్లోనే ఆ వేడుకలను చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సంద‌ర్భంగా ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి రేపు యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర నున్నారు.. అక్క‌డే వజ్రోత్సవ జన్మదినోత్సవాన్ని కుటుంబసభ్యులతోనే చేసుకోనున్నారు.. యూర‌ప్ లో ఆయ‌న మూడు రోజుల పాటు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.. ఇక ఈ నెల 22వ తేదీన తిరిగి ఢిల్లీకి రానున్నారు సీఎం . ఈ నెల 23న పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం యూరప్ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది.

ఇది ఇలా ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితంలో పుట్టిన రోజులు కూడా ఎప్పుడూ కుటుంబంతో గడప లేదు. కానీ ఇప్పుడు మాత్రం 75వ పుట్టిన రోజును మనవడితో సహా కుటుంబసభ్యులు అందరి సమక్షంలో చేసుకోవాలని నిర్ణయించారు. 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు కుటుంబానికి సమయం కేటాయించడం ప్రారంభించారు. అంతకు ముందు ఆయన పరిపాలనలో ప్రజల్లోనే ఎక్కువగా ఉండేవారు. 2019 తర్వాత మెల్లగా కుటుంబానికి సమయం పెంచారు. వీకెండ్స్ లో కుటుంబంతో గడుపుతున్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారానికి ఒక్క రోజు అయినా కుటుంబంతో గడుపుతున్నారు. కుటుంబ కార్యక్రమాలకూ హాజరవుతున్నారు. నారా రోహిత్ ఎంగేజ్మెంట్‌కు కూడా హాజరయ్యారు. మొత్తంగా చంద్రబాబు కుటుంబానికీ కొంత సమయం కేటాయిస్తూ ఉండటంతో.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని ముఖ్యమైన వేడుకల్ని కలిసి చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సారి చంద్రబాబు పుట్టిన రోజును కుటుంబం అంతా కలసి చేసుకోనుంది.

ఈ నెల 20వ తేదీన చంద్రబాబు 75వ జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *