ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ (Utnur) మండలం ఎంకా గ్రామానికి చెందిన దంపతులు పొలం పనులకు వెళ్లి వరద ఉధృతికి అక్కడే చిక్కుకుపోవడంతో ఉట్నూర్ పోలీసులు వెంటనే వారిని కాపాడి వరద గండం నుండి తప్పించారు. ఇప్పరీ ప్రహ్లాద్, శకుంతల పొలం పనుల నిమిత్తం వెళ్ళగా గురువారం సాయంత్రం వరకు ఇంటికి చేరుకోలేదు.

భారీ వర్షాల (Heavy rains) కారణంగా వాగు ప్రవాహానికి ఇంటికి చేరి దారి లేకపోవడంతో ఈ విషయం ఎంకా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఉట్నూర్ ఎస్సై ప్రవీణ్, ఏఎస్ఐ రామయ్య, కానిస్టేబుల్ అశోక్, రమేష్ జ్ఞానేశ్వర్లు జిల్లా ఫైర్ అధికారుల సహకారంతో వారిని సమయస్ఫూర్తితో తాడు సాయంతో ఒడ్డుకు చేర్చారు.

ఉట్నూర్ పోలీసులు (Utnur Police) ఆ దంపతులను కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న తీరును ఎస్పీ అఖిల్ మహజన్ (SP Akhil Mahajan) ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply