CID | కేసు క్లైమాక్స్ చేరుకున్నట్టేనా..?

CID | కేసు క్లైమాక్స్ చేరుకున్నట్టేనా..?

CID | పెనమలూరు, ఆంధ్రప్రభ: టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి శుక్రవారం పెనమలూరు (Penamalur) నియోజకవర్గం కానూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ విచారణను సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ చేయనున్నారు. పరకామణి కేసులో ఎవరి ప్రమేయం ఉంది.? బ్యాంకు లావాదేవీలు వంటి వాటి పై ఈ విచారణ సాగనుంది. డిసెంబరు 2వ తేదీన సీఐడీ అధికారుల కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. దీంతో పరకామణి చోరీ కేసు క్లైమాక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తుంది. సీఐడీ కార్యాలయానికి మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి దేవభక్తుని చక్రవర్తితో పాటు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు.

Leave a Reply