ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా….

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా….
- 49వ డివిజన్ ప్రచారంలో దూసుకుపోతున్న హర్షవర్ధన్ రెడ్డి
మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ డివిజన్ పరిధిలో 49 వ వార్డులో భారత రాష్ట్ర సమితి పార్టీ బలపరిచిన అభ్యర్థి సాయి హర్షవర్ధన్ రెడ్డి తరపున శనివారం ఉదయం జోరుగా ఇంటింటి ప్రచారం కొనసాగింది.ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…బిఆర్ ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో పాలమూరు పట్టణం కూడ హైదరాబాద్ కు సమాంతరంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.నన్ను ఈ ఎలక్షన్ లో తనను కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ పరిధిలోని శివాలయము, బి.కె. రెడ్డి కాలనీ, పోచమ్మ గుడి, ఉమర్ ఫరూఖ్, శేషాద్రినగర్, మహేశ్వరి కాలనీ, నాగిరెడ్డి కాలనీలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు.ప్రధానంగా వార్డులో రోడ్డు సమస్యలు, మంచినీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు, డ్రైనేజీ సమస్యలు,వీధిదీపాలు లాంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా అన్నారు.డివిజన్ ప్రజలందరూ కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు.
