MDK | కొత్త విప్ లను అభినందించిన హరీశ్ రావు
మెదక్ : శాసనమండలి, శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్ లుగా నియమితులైన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ఇవాళ కోకాపేట నివాసంలో మాజీ మంత్రి హరీశ్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారిని అభినందించారు. గొప్ప అవకాశం కల్పించిన కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.