AP | కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సీహెచ్ ద్వారకా తిరుమలరావు జనవరి 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది.
కాగా, హరీష్ కుమార్ గుప్తా ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. హరీష్ కుమార్ గుప్తా స్వస్థలం జమ్మూ కాశ్మీర్. 1992 బ్యాచ్ ఆంధ్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా.. పలు జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సంగతి తెలిసిందే.