కొత్త సంవత్సరంలో అన్ని సుఖ సంతోషాలే..

కొత్త సంవత్సరంలో అన్ని సుఖ సంతోషాలే..

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ “పరాభవ నామ సంవత్సర” ఉగాది శుభాకాంక్షలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో మొదలయ్యే ఈ తెలుగు నూతన సంవత్సరం, ప్రజలందరి జీవితాలలో శాంతి, సుఖ సంతోషాలను నింపాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కొత్త తెలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుండాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు పేర్కొంటూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply