Hanuman Mandir | భక్తుల సౌకర్యార్థం షెడ్ నిర్మాణం…

Hanuman Mandir | భక్తుల సౌకర్యార్థం షెడ్ నిర్మాణం…
Hanuman Mandir | జైనూర్, ఆంధ్రప్రభ : భక్తుల సౌకర్యార్థం షెడ్ నిర్మించడం సంతోషకరమని జైనూర్ మార్కెట్ కమిటీ(Market Committee) చైర్మన్ కుడిమేత విశ్వనాత్ రావు, సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ కొడప ప్రకాష్ అన్నారు. ఇవాళ కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ హిందూ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ అసిఫాబాద్(Asifabad) జిల్లా మందిర్ ఆవరణలో ఐదు నిర్మాణ పనులకు లక్షలతో నిర్మించే నూతన హిందూ కమ్యూనిటీ షెడ్ నిర్మాణ పనులకు చైర్మన్లు, సర్పంచ్ భూమిపూజ చేశారు.
జైనూర్ హనుమాన్ మందిర్(Hanuman Mandir) పూజారి కులకర్ణి పండిత్ మహారాజ్ చేతుల మీదుగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ డోంగ్రే ప్రకాష్, హిందూకమిటీ నాయకుడు ఆత్రంభీమ్రావు, హిందూ కమిటీ సభ్యులు, ఉద్యోగ హిందూ కమిటీ సభ్యులు ముత్యం వార్ రమేష్, జన్నావార్ పవన్ కుమార్, సతీష్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
