ఉట్నూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని సర్వజినిక్ హనుమాన్ మందిర్ లో గురువారం ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. హనుమాన్ మందిర్ అర్చకులు సంతోష్ దూబే ప్రత్యేక అర్చన పూజలు చేశారు. ఈ వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్,ఉట్నూర్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్, ఉట్నూర్ ఏఎస్పి రుత్విక్ సాయి, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జా దవ్, నాయకులు బిజెపి నాయకులు వివిధ పార్టీల నాయకులు పాల్గొని పూజలు చేసి మొక్కులు తీయించుకున్నారు.

అనంతరం ప్రత్యేక వాహనంలో హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. శోభయాత్ర సర్వజనిక్ హనుమాన్ మందిరం నుండి పాత బస్టాండ్ నుండి ప్రధాన రోడ్డు గుండా ఐబి చౌరస్తా లక్కారం హనుమాన్ మందిర్ వరకు యువకులను ముత్యాల మధ్య ఎంతో ఉత్సాహంగా శోభయాత్ర నిర్వహించారు. అదేవిధంగా మండలం లోని అన్ని గ్రామాల్లో గల హనుమాన్ మందిరాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్నా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉట్నూర్ లో నిర్వహించిన భక్తులు, యువకులు ఎండలో దరిద్రం ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఎంతో ఉత్సవంగా ఉభయాత్రని నిర్వహించారు. నీ వేడుకల్లో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీరామ్ నాయక్, బిజెపి నిర్మల్ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, వివిధ పార్టీల నాయకులు ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించిన శోభయాత్రలు ఎలాంటి ఆవాంచ నీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరిగేలా ఉట్నూర్ ఎస్ఐ విజయ్ కుమార్ పోలీసులతో బందోబస్తు పర్యవేక్షణ చేశారు.

Leave a Reply