Hanmakonda | ఫూలే సిద్దాంతాలు సమాజానికి అనుసరణీయం

Hanmakonda | ఫూలే సిద్దాంతాలు సమాజానికి అనుసరణీయం
ఫూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే, కుడా చైర్మన్..
Hanmakonda | హన్మకొండ చౌరస్తా, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy), కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి (Inagala Venkatram Reddy), హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, ములుగు రోడ్డులో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA) మాట్లాడుతూ… ఫూలే చూపిన సమానత్వం, న్యాయం, విద్యా హక్కుల మార్గం నేటికీ సమకాలీనమేనని చెప్పారు. సమాజం ముందుకు వెళ్లాలంటే విద్య ఏకైక సాధనమని ఫూలే (Phule) ఇచ్చిన సందేశాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఫూలే సిద్దాంతాలు అందరికీ ప్రేరణగా ఉండాలని, ఆ విలువలను ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా బలపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
