ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆది వారం టీఎస్ 5 సెట్ గురుకులాల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపల్ గోల్కొండ బిక్షపతి తెలిపారు. రాష్ట్రంలోని గురుకులాలలో ఐదో తరగతి లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు మొత్తం 432 మంది విద్యార్థులు ఆన్లైన్ లో ద రఖాస్తు చేసుకున్నారు. ఆది వారం జరిగిన ప్రవేశ పరీక్షల కు 425 మంది హాజరు కాగా ఏడుగురు పరీక్షకు గైర్హాజరైన ట్లు ప్రి న్సిపాల్ తెలిపారు. బాలురు 197 మంది, బాలిక లు 228 మంది పరీక్ష రాసిన ట్లు ప్రిన్సిపల్ గోల్కొండ బిక్షప తి తెలిపారు.
