రాష్ట్రస్థాయి ఖోఖో, కబడ్డీ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక

మద్నూర్ (ఆంధ్రప్రభ) : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభతో రాష్ట్రస్థాయికి దూసుకెళ్లారు. గత నెలలో నిజామాబాద్ జిల్లా స్థాయిలో నిర్వహించిన సీనియర్ ఖోఖో పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన జగదీష్ (9వ తరగతి), రుతిక్ (ఇంటర్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులు రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు.

వీరు ఈ నెల 7వ తేదీ నుండి పెద్దపల్లి జిల్లాలో జరగనున్న 58వ రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీల్లో పాల్గొననున్నారు. అలాగే, అరవింద్ (ఇంటర్ ప్రథమ సంవత్సరం) SGF అండర్–17 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఆయన ఈ నెల 8 నుండి 10 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరగనున్న పోటీల్లో పాల్గొననున్నాడు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుధాకర్, వ్యాయామ ఉపాధ్యాయులు గణేష్ నాగరాజు, నాగరాజు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులను అభినందించారు.

Leave a Reply