Guntur | సంబరాల రాంబాబునే…

Guntur | సంబరాల రాంబాబునే…

Guntur | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : పవన్ కళ్యాణ్ అన్నట్లుగా తాను సంబరాల రాంబాబునే అని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ‌ భోగి పండుగ సందర్భంగా గుంటూరులో తన అనుయాయులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి భోగి మంటలు వేశారు. తప్పెట్లకు అనుగుణంగా జగన్ పాటలకు ఉల్లాసంగా డ్యాన్స్ వేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంబరాల రాంబాబు అన్నారని.. సంక్రాంతి రోజు నేను నిజంగా సంబరాల రాంబాబునే అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. తాను చాలా చక్కగా డాన్స్ వేస్తానని కితాబిచ్చుకున్నారు. భోగి మంటల్లో కూటమి ప్రభుత్వం ఆసుపత్రుల పీపీపీ విధానానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను భోగి మంటల్లో కాల్చారు. రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Leave a Reply