Gummadidala | స్నేహితుడి కుటుంబానికి అండ‌గా..

Gummadidala | స్నేహితుడి కుటుంబానికి అండ‌గా..

  • మిత్రుల ఆర్థిక సాయం

Gummadidala గుమ్మడిదల, ఆంధ్రప్రభ : స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు కష్టాలలో తోడుంటామని నిరూపించారు గుమ్మడిదల మున్సిపల్ కేంద్రానికి చెందిన మిత్రులు. గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన బైండ్ల రమేష్ అనారోగ్య సమస్యతో ఇటీవల మృతి చెందాడు. తోటి మిత్రుని కుటుంబ స్థిగతులను దృష్టిలో ఉంచుకుని ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. మిత్రుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని గుమ్మడిదల ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1998-99 బ్యాచ్ మిత్రులు తమ వంతు సహాయంగా అతని భార్యకి 1,32,100/- అందజేశారు. వారి ఇద్దరి కుమారుల పైన ఎస్బీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. భవిష్యత్తులోనూ అతని భార్యా పిల్లలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.

Leave a Reply