GUDIVADA | లింగవరంలో పాత గొడవలు.. వ్యక్తిపై దాడి

GUDIVADA | లింగవరంలో పాత గొడవలు.. వ్యక్తిపై దాడి
GUDIVADA | గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ మండలం లింగవరంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. గ్రామానికి చెందిన శ్రీనివాసరావుపై గోపాలస్వామి, శివయ్య, చిరంజీవి రెడ్డి, మనోహర్లు మూకుమ్మడిగా దాడికి పాల్పడినట్లు బాధితుడు వాపోయాడు. చేపల చెరువు విషయంలో తలెత్తిన వివాదం, అక్రమ మట్టి తవ్వకాలపై శ్రీనివాసరావు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు నష్టం కలిగించావంటూ ప్రత్యర్థులు కక్షగట్టి దాడి చేశారన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
