Gudivada | కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే..

Gudivada | కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే..

Gudivada | గుడివాడ – ఆంధ్రప్రభ : ఆపత్కాలంలో టీడీపీ కుటుంబ సభ్యులకు పార్టీ నాయకత్వం అన్నివేళలా అండగా ఉంటుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుండెపోటుతో మరణించిన టీడీపీ నాయకుడు, శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ సభ్యుడు పొగిరి రమణ భౌతికకాయానికి గణేష్ నగర్ కాలనీలోని ఆయన స్వగృహంలో….. ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ఉదయం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పిన నాయకులు, అన్నివేళల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…. దశాబ్దాలుగా టీడీపీలో క్రియ శీలకంగా పని చేస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పొగిరి రమణ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. స్వర్గీయ రమణ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరఫున తామంతా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ…..కుటుంబ సభ్యుడు రమణ మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి వ్యక్తి అయినా రమణ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ముందుగా రాజేంద్రనగర్ లోని స్వగృహంలో ఎమ్మెల్యే రాముని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ అప్పలనాయుడు, కొద్దిసేపు పార్టీ నాయకులతో మాట్లాడారు.

ఏపీ ఎస్ డబ్ల్యూ సి చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, దానేటి సన్యాసిరావు, గుడివాడ జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, టీడీపీ నాయకులు చేకూరు జగన్ మోహన్ రావు, కొడాలి రామరాజు, జనసేన నాయకులు వెంకట్ తదితరులు రమణ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Leave a Reply