Gudigandla | గెలిపిస్తే గుడిగండ్లను అభివృద్ధి చేస్తా
సర్పంచ్ అభ్యర్థి పెద్ద నర్సిములు
Gudigandla | మక్తల్, ఆంధ్రప్రభ : గుడిగండ్ల గ్రామాభివృద్ధి కోసం గ్రామంలోని ప్రజలందరూ తనను ఆదరించి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి పెద్ద నర్సిములు అన్నారు.
ఇవాళ గ్రామంలో తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా గ్రామ అభివృద్ధికి నోచుకోలేదని, సర్పంచ్ గా ఆదరిస్తే అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు వచ్చే విధంగా చూస్తానని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని ప్రతి సమస్యను తెలుసుకున్న వ్యక్తిగా తనను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవచేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే గుడిగండ్ల గ్రామ రూపురేఖలు మారుస్తానన్నారు.

