జీఎస్టీతో సామాన్యులకే లాభం
- అవగాహనా ర్యాలీలో ఎమ్మెల్యే శంకర్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు భాగంగా తీసుకువచ్చిన జి ఎస్ టి 2.0(GST 2.0) ధరల భారం తగ్గింపు పై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన ఉండాల్సిన ఆవశ్యకత ఉందని శాసన సభ్యులు గోండు శంకర్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానం నుండి డే అండ్ నైట్, రామలక్ష్మణ(Ramalakshmana), సూర్య మహల్ జంక్షన్ మీదుగా సెవెన్ రోడ్ కూడలి వరకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య ర్యాలీ నిర్వహించారు.
ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో ఈ నెల13 తేదీ నుంచి నవంబర్ 19 వరకు నెలరోజులపాటు జి ఎస్ టి 2.0 సూపర్ జీఎస్ టి ధరల తగ్గింపు పై ప్రత్యేక ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించననున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ 2.O పన్ను సంస్కారణల ద్వారా ఇటీవల అమలులోకి వచ్చిన పన్ను రేట్ల తగ్గింపుల ఫలితంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయని తద్వారా సామాన్య, మధ్య(Sanam, Madhya) తరగతి వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
ప్రజలకు ఆర్థిక భారం తగ్గి, విజయదశమి – దీపావళి పండుగలను మరింత ఆనందంగా చేసుకునే సువర్ణ అవకాశం లభించిందని అన్నారు. జిఎస్టి నాలుగు స్లాబ్ నుంచి రెండు స్లాబ్ లకు పరిమితం చేయడం జరిగిందన్నారు. సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా 99 శాతం వస్తువులను ఐదు శాతంస్లాబు పరిధిలోకి చేర్చారని, ఆరోగ్య భీమా(Health Insurance) పన్నును పూర్తిగా తొలగించారని తెలిపారు. దీనివల్ల సామాన్య ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని వివరించారు.
జి ఎస్ టి ధరల తగ్గింపు పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాణిజ్య శాఖ, పరిశ్రమల శాఖ(Industries Department) సహకారంతో ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జీఎస్టీ మార్పులపై స్పష్టమైన అవగాహన, ధరల పారదర్శకత, వ్యాపారాభివృద్ధి లక్ష్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించాలని పాత జీఎస్‌టీ ధరలు కాకుండ కొత్త పద్ధతి ధరల తగ్గింపు ప్రకారం కొనుగోలు అయ్యే విధంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్స్, కార్మిక శాఖ, హోల్ సేల్(Wholesale) విభాగ సభ్యులు పాల్గొన్నారు.