Murder | భర్త చేతిలో భార్య…

Murder | భర్త చేతిలో భార్య…

తప్పించుకున్న కూతురు..

Murder | ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం కొత్త మున్సిపాలిటీ పరిధిలోని లయన్స్ క్లబ్ పక్కనున్న సందులో దారుణ ఘటన చోటుచేసుకుంది. భాస్కర్ అనే వ్యక్తి తన భార్య సాయివాణి (Saivani) (31) గొంతు కోసి హత్య చేశాడు. సాయివాణి చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందినవారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… ముందుగా భాస్కర్ (Bhaskar) తన కన్న కూతురును చంపేందుకు కత్తితో దాడి చేశాడు. చాకచక్యంగా పరారైన చిన్నారి ప్రాణాలు కాపాడుకుంది. అయితే కత్తి దాడిలో ఆమె మూడు వేళ్లు తెగిపోయాయి. అనంతరం భాస్కర్ భార్య సాయివాణిపై దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు.

హంతకుడు భాస్కర్‌ను పోలీసులు (police) అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కలహాలు నెలకొని ఉండటమే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply