యాదగిరి కొండ పై సామూహిక గీతాలపన..

యాదగిరి కొండ పై సామూహిక గీతాలపన..

యాదగిరి కొండ, (ఆంధ్రప్రభ)
భారత జాతీయ గేయం ‘వందేమాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దేశ వ్యాప్తంగా సామూహిక గీతాలపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు శుక్రవారం ఉదయం 10:00 గంటలకు ఈ గీతాలపన పొగ్రామ్ ఏర్పాటు చేశారు. దేవస్థానం ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన ఈ చారిత్రక కార్యక్రమంలో అధికారులు, ఈ ఈ దయాకర్ రెడ్డి, ఏ ఈ ఓ లు గజవల్లి రఘు, నవీన్, జె కృష్ణ, మహేష్, ఆలయ ప్రధాన అర్చకులు సురేంద్రచారీలు పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్.పి.ఎఫ్. సి.ఐ. శేషగిరిరావు, ఇతర సిబ్బంది, అర్చక పురోహితులు, భద్రతా సిబ్బంది, సంస్కృత పాఠశాల విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతాన్ని అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా ఆలపించారు. ఈ సామూహిక గీతాలపన కార్యక్రమం జాతీయ సమైక్యత, దేశభక్తిని మరోసారి చాటింది. వందేమాతరం గీతం భారతమాత ఔన్నత్యాన్ని, శక్తి సామర్థ్యాలను వివరించే ఒక మహోన్నత మంత్రం వంటిదని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply