Group 1 officer | రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన గ్రూప్ 1 అధికారి

Group 1 officer | రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన గ్రూప్ 1 అధికారి

  • అభినందించిన శక్తి ఫౌండేషన్ అధ్యక్షులు శివ ప్రసాద్ రెడ్డి.

Group 1 officer | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీకృష్ణ నగర్ వీధికి చెందిన శక్తి ఫౌండేషన్(Shakti Foundation) వ్యవస్థాపకులు చింతాన్ పల్లి శివ ప్రసాద్ రెడ్డి సహకారంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తదానం చేసి ప్రాణాలు నిలిపారు.

శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల్ జిల్లా కోటం దొడ్డి గ్రామానికి చెందిన విజయ భాస్కర్ రెడ్డి చికిత్స నిమిత్తం హైదరాబాదులోని పంజా గుట్ట నిమ్స్ ఆస్పత్రిలో చేరగా అక్కడి వైద్యులు బి పాజిటివ్ రక్తం(B positive blood) కావాలని కుటుంబ సభ్యులకు తెలిపారు.

దీంతో శక్తి ఫౌండేషన్ సభ్యుడు గ్రూప్ 1అధికారి వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి బాధితుడికి కావాల్సిన బి పాజిటివ్ రక్తం దానం చేశారు. గ్రూప్ 1 అధికారి(Group 1 officer) వెంకటేష్ ఐదోసారి రక్తదానం చేయడంతో పలువురు అభినందించి సన్మానించారు.

Leave a Reply