లక్ష్మి గ్రామైక్య భవనానికి భూమి పూజ..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని బాండేర్ గ్రామపంచాయతీ కేంద్రంలో ముంజి గూడ లక్ష్మి గ్రామైక్య సంఘానికి ఉపాధి హామీ పథకం ద్వారా లక్ష్మి గ్రామక్య సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో శుక్రవారం బాండేర్ పంచాయతీ సర్పంచ్ కుమ్ర భీమ్రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని పనులుత్వరగాపూర్తిచేయాలని ఈ భవనం నిర్మాణంతో సంఘాల మహిళలకు సమావేశాలునిర్వహించడానికిఎంతోఉపయోగపడుతుందని సర్పంచ్ కుంర భీంరావ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ ఆత్రం భీంరావ్, జైనూర్ ఉప సర్పంచ్ డోంగ్రే ప్రకాష్,ఐకెపిసిసి జై వంతరావు, వివో ఏ సలాం తుకారం, బి ఎల్ ఓ భీమ్రావు, కారోబార్ తొడసం గంగారం, గ్రామైక్య సంఘ నాయకురాలు బిజిలాబాయి, వర్క్ ఇన్స్పెక్టర్ బాబూలాల్, తదితరులు పాల్గొన్నారు.
