కర్నూల్ బ్యూరో (ఆంధ్రప్రభ) : కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలంలో గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మించడం మహా అద్భుతమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అన్నారు. ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేయడం పట్ల కంపెనీ మేనేజ్మెంట్ ని అభినందించారు.
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిగా గ్రీన్ కో ఎనర్జీ పవర్ ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (Green Co Integrated Renewable Energy Project) ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాజెక్ట్ యాజమాన్యంతో కలిసి ప్రాజెక్టును సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ కో ఇంటిగ్రేడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నసందర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగిందన్నారు.
దేశ వ్యాప్తంగా పవర్ కంజక్షన్, పొల్యూషన్ విపరీతంగా పెరిగింది. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఖర్చు,కలుషితం పెరుగుతుందిఅన్నారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందన్నారు. దేశంలో వివిధ ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ లు నిర్వహణ చేస్తున్నారు అని తెలిపారు.
2025 తెలంగాణలో కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ తీసుకో రావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం గుర్తు చేశారు. మొత్తం 20 వేలమెగావాట్ల గ్రీస్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాము అన్నారు.
లక్షల కోట్లు ఖర్చు చేసి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒప్పదాలు చేసుకున్నామనీ వెల్లడించారు.గ్రీస్ కో కంపెనీవారు అనుకున్న సమయంలో ప్రాజెక్ట్ పూర్తి చేసి కరెంట్ ఉత్పత్తి చేస్తుంది.ఏ విధంగా పవర్ ప్రొడక్షన్ జరుగుతుందో తెలుసుకోవడకి ఇక్కడి రావడం జరిగిందన్నారు.
సోలార్ ద్వారా 4వేల మెగావాట్ల విద్యుత్తు,విండ్ హైడ్రా ద్వారా 2 వేల గ్రీన్ ఎనర్జీ ఇక్కడ నుంచి ఉత్పత్తి చేస్తుంద న్నారు.గ్రీన్ కో కంపెనీని అభినందిస్తున్నాను, పారిశ్రామిక వేతలు ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకొని రావడం దేశ సంపద పెరిగేందుకు కారణం అవుతుందన్నారు. విద్యుత్ సరఫరా ద్వారా దేశ జీడీపీ పెరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తో పాటు గ్రీన్ కో ప్రాజెక్ట్ యాజమాన్యం చలమ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.