ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీల జట్టు ఈజీ విక్టరీ సాధించింది. తొలుత ఇంగ్లండ్‌ను 179 పరుగులకు ఆలౌట్ చేసిన దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత ఛేజింగ్ లోనూ అదరగొట్టింది.
వన్ డౌన్ లో వచ్చిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (72 నాటౌట్), వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (64) అర్ధ సెంచరీలతో విజృంభించారు. దీంతో 180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 29.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
ఈ విజయంతో 5 పాయింట్లు సాధించిన సఫారీ జట్టు… గ్రూప్-బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంలో నిలిచింది.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. దక్షిణాఫ్రికా దాటికి కుప్పకూలింది. సఫారీల బౌలింగ్‌కు ఇంగ్లండ్‌లోని విధ్వంసక బ్యాటర్లంతా.. స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో టోర్నీలో ఇంగ్లండ్ అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కేవలం 179 పరుగులు మాత్రమే చేసి 38.2 ఓవర్లలోనే ఆలౌటైంది.
సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్ మూడు వికెట్లతో చెలరేగారు. కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీయగా.. లుంగీ ఎన్గిడి, కగిసో రబడ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోరూట్ (37) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక జోఫ్రా ఆర్చర్ (25), బెన్ డకెట్ (24), కెప్టెన్ జాస్ బట్లర్ (21) పరుగలుకే వెన్ను చూపారు.