ఘ‌నంగా నివాళులు..

ఘ‌నంగా నివాళులు..

క‌డెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఏలగడప ఎంపీపీ ఎస్ పాఠశాల(MPPS School)లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కడెం మండల మైనార్టీ నాయకులు మొహమ్మద్ సలీం(Mohammad Salim) ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు భారత ప్రభుత్వ తొలి విద్య శాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్(Maulana Abdul Kalam Azad) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక పాఠశాల హెచ్ఎం కూచనపల్లి శ్రీనివాస్(Kuchanapally Srinivas), ఉపాధ్యాయుడు సనా కౌసర్ కావ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు అబ్దుల్ రహీం, స్థానిక మాజీ ఎంపీటీసీ నర్సింగ్ రమేష్, నాయకుడు మల్లేష్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply