Great Honor | హీరోయిన్‌ సంచితా శెట్టికి గౌరవ డాక్టరేట్‌…

చెన్నై – మనం చేసిన మంచి పనిని గుర్తించటమే కాకుండా ఆ పనికి అవార్డులు(awrds ) రివార్డులు (rewards ) వస్తే అంతకంటే ఆనందం(happiness ) ఏముంటుంది…ప్రస్తుతం అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్న‌ది ఫేమస్‌ తమిళ, కన్నడ, తెలుగు నటి సంచితా శెట్టి (actress sanchita shetty ) . సంచితా విజయ్‌ సేతుపతి (Vijay sethupathi ) హీరోగా నటించిన ‘సూదుకవ్వుమ్‌’, ఆశోక్‌ సెల్వన్‌ హీరోగా నటించిన ‘విల్లా’తో పాటు ప్రభుదేవా హీరోగా ‘భగీరా’ చిత్రాలతో పాటు దాదాపు 25 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

నటనతో పాటు సంచిత చేసిన యూత్‌ లీడర్‌ షిప్‌ సేవలను దృష్టిలో ఉంచుకుని సెయింట్‌ మథర్‌ థెరిసా యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ (Honorable doctorate ) ప్రకటించింంది. ఈ నేప‌థ్యంలో కోయంబత్తుర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సంచితకు ఈ అవార్డును అందచేశారు. అవార్డును స్వీకరించిన అనంతరం సంచిత మాట్లాడుతూ, ఇకపై మరిన్ని మంచి పనులు చేయటానికి ఈ డాక్టరేట్‌ కొత్త ఊపిరిని అందించిందని సంచితా శెట్టి పేర్కొంది. ఈ అవార్డుకు తనను అంద‌జేసిన యూనివ‌ర్శిటీ యాజ‌మాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు.

Leave a Reply