ఘ‌నంగా ఆరాధ‌నోత్స‌వం

ఘ‌నంగా ఆరాధ‌నోత్స‌వం

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : ఆదికవి వాల్మీకి మహర్షి(Sage Valmiki) జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీ. గీతే అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల(flower garland) వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి, బోయవాణిగా జీవితం గడిపి, సప్తర్షుల బోధనలతో మహర్షిగా మారి ఆదికావ్యం రామాయణం(Ramayana) అనే అమరగ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత అన్నారు. కృషి, నిబద్ధత ఉంటే మనుషులు ఋషులవుతారు(people become sages), మహాపురుషులవుతారన్నారు. దీనికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీ.ఐలు రవి, నాగేశ్వరరావు(Nageswara Rao), ఆర్.ఐ రమేష్, ఏ. ఓ పద్మ, జిల్లా పోలీసు అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply