ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఊరేగింపు..

ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఊరేగింపు..
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని రాఘవపూర్ గ్రామంలో శ్రీ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక ఊరేగింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్బంగా హనుమాన్ భక్తులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి పల్లకీ ఊరేగింపును గ్రామమంతా ఘనంగా నిర్వహించారు. భక్తులు భజనలు, మంగళవాద్యాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ క్రాంతి కుమార్, ఉప సర్పంచ్ నరసింహులు, ఆలయ కమిటీ చైర్మన్ రావుల రవి, వైస్ చైర్మన్ బత్తిని రాజు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
