ఘనంగా పుట్టిన‌రోజు వేడుకలు

ఘనంగా పుట్టిన‌రోజు వేడుకలు

ఖమ్మం బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి(Tumburu Dayakar Reddy) ఇతర నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన వేగం పెరిగిందన్నారు. ప్రజల అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చే విధానంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలేరు, ఖమ్మంతో పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply