ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో హేమాచల లక్ష్మీనృసింహ స్వామి రైతుమిత్ర మార్కెటింగ్ సంఘం (పీఎస్ఎస్పీపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సెంటర్ ఇన్‌చార్జి అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏ గ్రేడు రకం వడ్లకు 2389, సీ గ్రేడు రకం వడ్లకు 2369 రూపాయల మద్దతు ధర నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

