ధాన్యం రవాణా వాహనాల నమోదు షురూ

  • శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ స్పష్టం


(శ్రీకాకుళం, ఆంధ్రప్రభ) : ఖరీఫ్ 2025-26 (Kharif 2025-26) సీజన్‌ లో ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల నుంచి మిల్లులకు తరలించేందుకు కొత్త వాహనాల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, ధాన్యం రవాణా చేసే ప్రతి వాహనానికి కచ్చితంగా జీపీఎస్ పరికరం అమర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ (Collector Furman Ahmed Khan) సోమవారం స్పష్టం చేశారు. దీనికోసం ఆసక్తి ఉన్న వాహనదారులు ముందుగా రూ.3,068 లు – (జీఎస్టీతో కలిపి) చెల్లించి, జీపీఎస్ అమర్చుకోవాలని ఆ తర్వాతే జిల్లాలోని ఆయా మండలాల్లోని రైతు సేవా కేంద్రాల వద్ద తమ వాహన వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

జీపీఎస్ (GPS) లేకుండా రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న వాహనాలకు మాత్రమే రవాణా ఖర్చులను ప్రభుత్వ నిబంధనల మేరకు చెల్లిస్తుందని, రవాణా కాంట్రాక్టు ఆశించే వాహనదారులు ఆలస్యం చేయకుండా, వెంటనే జీపీఎస్ అమర్చుకొని, ఆయా రైతు సేవ కేంద్రాలకు వెళ్లి వాహనాల వివరాలను తక్షణమే నమోదు చేసుకోవాలని జేసీ కోరారు.

Leave a Reply