GOVT SCHOOL | అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..

GOVT SCHOOL | అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..


GOVT SCHOOL | కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : తమ గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఒకసారి అవకాశం కల్పించాలని బెల్లాల్ నర్సింగాపూర్ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న బెల్లాల్ సర్పంచ్ అభ్యర్థి బొంతల లక్ష్మి డాక్టర్ భూమన్న యాదవ్ అన్నారు. పై గ్రామాల అభివృద్ధి కోసం 24 గంటలు అందుబాటులో ఉండి మీ సేవకురాలిగా పని చేస్తామన్నారు. ప్రతిరోజు గ్రామపంచాయతీలో అందుబాటులో ఉంటామన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రభుత్వం పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మిస్తామన్నారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు.

అర్హులైన వారికి రేషన్ కార్డులు, లేబర్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, వితంతు, వికలాంగుల, బీడీ కార్మికుల పింఛన్లు మంజూరు చేయిస్తామన్నారు. గోదావరి పరిసరాల్లో వీధి లైట్లు సుందరీకరణ, బతుకమ్మ ఘాట్ ఏర్పాటు, గ్రామ యువకులకు క్రికెట్ సామాగ్రి, గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. బెల్లాల్ జీపీ పరిధిలో ప్రజా సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, గ్రామంలో మౌలిక సదుపాయాలు తదితర సమస్యలను ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు.

Leave a Reply