Govt | పేదబడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా…

Govt | పేదబడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా…

  • జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

Govt | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : పేదబడుగు,బలహీనవర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ మరియు సీఎం సహాయనిధి (సిఎంఅర్ఎఫ్)చెక్కులను అందజేశారు.పేద కుటుంబంలో ఆడపిల్లలు బరువు కవదన్న ఉద్దేశంతో వారి వివాహాల కోసం కల్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకం ద్వారా వారి కుటుంబాలకు లక్ష పైచేలుకు రూపాయలు ఆర్థిక సహాయం అందించి,ఆకుటుంబంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వెలుగు నింపుతుందన్నారు.

దీంతోపాటు ఆనుకొని పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స పొంది ఆరోగ్యవంతులైన వారికి సీఎం సహానిధి ద్వారా ఆర్థికంగా ఆదుకోవడమే,కాకుండా విపత్కర పరిస్థితులు శాస్త్ర చికిత్సలు అవసరం ఉన్నప్పుడు సీఎం సహాయనిధి ద్వారా ముందస్తు(ఎన్ఓసి)చెక్కులను కూడా అందించడం జరుగుతుందన్నారు.

Govt |

దీంతోపాటు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యా,వైద్య,త్రాగు, సాగు,పరిశ్రమరంగాల్లో కూడా తమవంతు కృషిచేస్తూ ముందుకు సాగటం జరుగుతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలందరి కుటుంబాల్లో సంతోషం వేల్లవిరుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Govt |

Leave a Reply