పేదలకు సొంత గూడు కల నెరవేర్చిన ప్రభుత్వం

పేదలకు సొంత గూడు కల నెరవేర్చిన ప్రభుత్వం
- ఇందిరమ్మ పథకంతో పెంకిటిల్లుల నుంచి పక్కా ఇళ్లలోకి మారిన పేద కుటుంబాలు
- బీఆర్‌ఎస్ హయాంలో కలలుగానే మిగిలిన ఇళ్లు…కాంగ్రెస్ పాలనలో నిజమైన సొంత గూడు
- అర్హులకు ఇళ్లు అందించిన ప్రభుత్వానికి లబ్ధిదారుల కృతజ్ఞతలు
- తానేదార్ పల్లిలో నేడు ఇళ్లను ప్రారంభించనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథ కం పేదల గృహ స్వప్నాలను సాకారం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఆనం ద వాతావరణాన్ని నెలకొల్పుతోంది. ఎన్నో సంవత్సరాలుగా సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం ఆశాకిర ణంగా మారింది.
ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారంతో పేద కుటుం బాలు తమ స్వంత గూడు కలను నిజం చేసుకుంటున్నాయి. ఈ నేప థ్యంలో స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తానేదార్‌పల్లి గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో పలువురు లబ్ధిదారులు ఇప్పటికే నిర్మా ణ పనులు పూర్తి చేసుకుని గృహప్రవేశానికి సిద్ధమయ్యారు. ఇంతకా లం ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవించిన కుటుంబాలకు ఈ ఇళ్లు కొత్త జీవనానికి నాంది పలుకుతున్నాయి. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి.
నేడు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న ఎమ్మెల్యే కడియం:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తానే దార్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నేడు (ఆదివారం) ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ జిల్లా నాయకులు బెల్ది వెంకన్న తెలిపారు. అదే విధంగా గ్రామ అభి వృద్ధికి కీలకంగా నిలిచే రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ల ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజ రై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కష్టాల్లో జీవించాం:(లబ్ధిదారురాలు చిలువేరు పద్మ, తానేదార్ పల్లి )

ఇప్పటివరకు పెంకిటిల్లులో ఎన్నో కష్టాలు అనుభవించాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో సొంతిల్లు కల నిజమైంది. మా కుటుం బానికి ఇది ఎంతో పెద్ద ఉపశమనం కలిగించింది. త్వరగా పూర్తి అయ్యే లా సహకరించిన జిల్లా నాయకులు వెంకన్నకు కృతజ్ఞతలు. అలాగే మా కష్టాలను గుర్తించి సొంతిల్లు కలను నిజం చేసిన కడియం శ్రీహరి సార్‌కు జీవితాంతం ఋణపడి ఉంటాం.
ప్రాణం ఉన్నంత వరకు కడియం శ్రీహరి సార్ ను మర్చిపోం: (లబ్ధిదారురాలు కొత్తపల్లి రజిత, తానేదార్ పల్లి )

మాకు ఉన్న పెంకిటిల్లు పూర్తిగా కూలిపోవడంతో అద్దె ఇంట్లో జీవించా ల్సి వచ్చింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అండగా నిలిచి సొంతిల్లు కలను నెరవేర్చింది. గత బీఆర్ఎస్ హయాంలో అవకాశం రాకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం సంతోషంగా ఉంది. మాకు సహకరించిన జిల్లా నాయకులు వెంకన్నకు కృతజ్ఞతలు. అలాగే మా జీవితాల్లో వెలుగు నింపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ ను ప్రాణం ఉన్నంత వరకు మరిచిపోం.
