goods vehicles | గూడ్స్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం

goods vehicles | గూడ్స్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం

goods vehicles | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిబంధనలకు విరుద్ధంగా గూడ్స్ వాహనాల్లో ( సరుకు రవాణా వాహనాల్లో ) ప్రయాణికులను తరలించడం చట్టరీత్యా నేరమని, ఇది అత్యంత ప్రమాదకరమని కమ్మర్ పల్లి ఏఎస్ఐ జి. నరేందర్ హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు బుధవారం కమ్మర్ పల్లి మండల పరిధిలో గూడ్స్ వాహన డ్రైవర్లు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఎస్ఐ నరేందర్ మాట్లాడుతూ సరుకు రవాణా కోసం కేటాయించిన వాహనాల్లో ప్రజలను తరలించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ అన్నారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించే వారికి ఇన్సూరెన్స్ వర్తించదని, తద్వారా బాధితులు ఆర్థికంగా కూడా నష్టపోతారని వివరించారు.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గూడ్స్ వాహన డ్రైవర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply