- రెండు రోజుల్లో రూ.4,400లు పెరుగుదల
- అంతలోనే రూ.1230లు తగ్గింపు
- ఊహలు తల్లకిందులు
ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్ : వామ్మో రెండు రోజుల్లో నాలుగువేల పైనే బంగారం దాటిపోయిందని గోల్డ్ లవర్స్ బిక్కచచ్చిపోయిన తరుణంలో.. దసర సంబురం ముగిసే లోపునే బంగారం ధర పడిపోయింది. పది గ్రాముల మేలిమి బంగారం ధర 1,235లు క్షీణించగా.. 22 క్యారెట్ల బంగారం ధర లో రూ.550లు, 18 క్యారెట్ల బంగారం ధర 390లు తగ్గింది.
ఈ నిన్నటి కొనుగోళ్ల జాతరలో బంగారం ధర రయ్ రయ్ న దూసుకు పోగా.. ఈ రోజు కూడా మరో రూ.2వేలకు బంగారం ధర పైకి చేరుతుందని బంగారం ప్రియులు భయపడ్డారు. కానీ దేవుడు పాట రూ.10లు పెంచి బులియన్ మార్కెట్లు గేట్లు తెరవగా.. దుఖాణాలకు వచ్చే పసిడి ప్రేమికుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,925లతో అమ్మకాలు ప్రారంభం కాగా.. గురువారం రాత్రి 7.00 గంటలకు రూ.1,18,690లకు తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,310ల నుంచి రూ.1,08,800లకు పడిపోయింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.89,410ల నుంచి రూ.89,020లకు తగ్గిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో.. ఖుషీ ఖుషీ
ఇక ఏపీ, తెలంగాణల్లో దసరా పండక్కి బులియన్ మార్కెట్ మిలమిల మెరిసింది. భారత దేశంలోనే బంగారం వ్యాపారంలో అత్యధిక వాటాను కలిగిన ఈ రాష్ట్రాల్లో బంగారం ధర యమస్పీడ్ తో దూసుకు పోతున్న తరుణంలో బులియన్ మార్కెట్ గురువారం తేలముఖం వేసింది. రాబోయే రెండు రోజుల్లో బంగారం ధర రికార్డు స్థాయిలో దూసుకు పోతుందనే ఊహలు తల్లకిందులయ్యాయి.

