ఏపీలో 2309 వీహెచ్ సీలు మంజూరు
భవన నిర్మాణాలకు సర్కారు ఆమోదం
( ఆంధ్రప్రభ, వెలగపూడి )
పల్లెల్లో అందరికీ ఆరోగ్యం లక్ష్యంతో ఏపీలో 2309 విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విలేజ్ హెల్త్ క్లినిక్స్ ( Ayushman Helth Clinics ) ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి రూ.217.10 కోట్లు విడుదల కాగ, MGNREGS పథకం కింద మొత్తం 2309 భవనాలు నిర్మాణానికి ఆమోదం లభించింది. అదనంగా PM-ABHIM స్కీం కింద మరో 696 భవనాల (ప్రతి యూనిట్ ఖర్చు రూ.55.00 లక్షలు) నిర్మాణానికి అనుమతి లభించింది. ప్రతి యూనిట్‌లో రూ భవనం నిర్మాణానికి .42.00 లక్షలు, ప్రహరిగోడ, నీరు, విద్యుత్ సదుపాయాలకు రూ. 13.00 లక్షలు ఉపయోగిస్తారు.