క్రీస్తు త్యాగాల జ్ఞాపకం గుడ్ ఫ్రై డే..

క్రీస్తు త్యాగాల జ్ఞాపకం గుడ్ ఫ్రై డే..
ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ : గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రేమ, శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ ,దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులంధరూ ఘనంగా జరుపుకోవాలని రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పవిత్ర దినం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు.
