పరకాలలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పరకాల పట్టణంలో శుక్రవారం రోజు ఉదయం కారుణ్య యేసు కథోలిక ప్రార్థన మందిరం ఫాదర్ రెవరెండ్. బాలరాజు ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ను పురస్కరించుకొని పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా యేసు సిలువ యాత్ర కార్యక్రమము అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రదర్శించడం జరిగింది.

పట్టణ ప్రజలు సిలువ యాత్ర కార్యక్రమమును శ్రద్ధతో తిలకించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీను, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ మడికొండ. సంపత్ కుమార్, సిస్టర్ మెరీన్, బొచ్చు. జాన్సన్, చంద్రశేఖర్, కిషన్, అరికెళ్ల దశరథం, నాగేల్లి సుగుణ, యువతి, యువకులు, సంఘస్తులు, పట్టణ ప్రజలు, అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply