Gold Target : ₹ లక్షన్నర Andhra Prabha Analysis

Gold Target : ₹ లక్షన్నర Andhra Prabha Analysis

  బంగారం పరుగో పరుగు

అతి త్వరలోనే ₹1.5 L

అమెరికా డాలర్​ పతనం

వెనుజులా క్రూడ్​ షాక్​

( ఆంధ్రప్రభ, బిజినెస్​ డెస్క్)​

Gold Target  |    గత వారం రోజులుగా బంగారం (Gold Target) ధర అలుపు సొలుపును పక్కన పెట్టి మరీ పరుగులు (₹ 1.5 L) తీస్తోంది. ఇటు భారత దేశంలో పెళ్లిళ్ల బాజా భజంత్రీల గోల.. అటు వెనుజులా (Venizula)  తో అమెరికా (America)  పితలాటకం (Fight) క్రూడ్​ ఆయిల్​ ధర పెంచితే.. ఇంకో వైపు మూడు నెలల కాలంలోనే డాలర్​ విలువ (Dollar Decline) పడిపోయింది. ఇక భారత రూపాయి విలువ కాస్త బలపడినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లులోనూ బంగారం ధర దూసుకు పోతోంది.

Gold Target

Gold Targe

ఫలితంగా.. గడిచిన వారం రోజుల బంగారం ధరల లెక్క గడితే.. 24 గ్రాముల మేలిమి బంగారం ₹ 5,080లు పెరిగింది. ఆభరణాల బంగారం ( 22 క్యారెట్లు) ధర ₹ 4,650లు పెరిగింది. డిసెంబర్​ 16న బంగారం ధర పడిపోయింది. ఆ రోజున మేలిమి బంగారం 10 గ్రాముల ధర ₹ 1,520లు  తగ్గి  ₹ 1,35,380ల  నుంచి    ₹ 1,33,860లకు చేరింది.  ఆభరణాల బంగారరం 10 గ్రాముల  ధర  ₹ 1,400లు తగ్గి ₹1,24,100 ల నుంచి ₹1,22,700లకు చేరింది.    ఆ తరువాత బంగారం ధర ఊపందుకుంది. డిసెంబర్​ 17న  మేలిమి బంగారం 10 గ్రాముల ధర ₹600లు. ఆభరణాల బంగానం 10 గ్రాముల ధర ₹600లు పెరిగింది. మరుచటి రోజు మేలిమి బంగారం మరో ₹ 330లు, ఆభరణాల బంగారం ₹ 300లు పెరిగింది.  2025 డిసెంబర్  19న 10 గ్రాముల   24 క్యారెట్ల బంగారం ధర ₹ 660లు తగ్గి ₹1,34,180లకు,  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  ₹ -600లు తగ్గి 1,23,000లకు చేరింది.

\Gold Targe

Gold Target

మరో రెండు రోజులు బంగారం ధర తగ్గలేదు. స్థిరంగా ఉంది. 2025 డిసెంబర్  22న అకస్మాత్తుగా  మేలిమి బంగారం 10 గ్రాముల ధర ₹1,970లు పెరిగింది.  ₹1,36,150లకు పెరిగింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 1800లు పెరిగి  ₹1,24,800కు చేరింది. ఇక మరుచటి రోజు కూడా బంగారం ధర స్పీడ్​ పెరిగింది. 2025 డిసెంబర్  23న  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 2,400లు పెరిగింది.   ₹1,38,550లకు, 22 క్యారెట్ల బంగారం ధర ₹ 2,200లు పెరిగి ₹1,27,000లకు చేరింది. ఇంకేముందీ బంగారం ధర అతి త్వరలోనే ₹1.5 Lakh గమ్యమానికి చేరువులో ఉందని బులియన్​ వర్గాలు అంచనా ప్రారంభించాయి. గత రెండు రోపజులతో పోల్చితే బుధవారం (డిసెంబర్​ 24న) బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర ₹ 380లు పెరిగి ₹1,38,930లకు చేరింది.  ఆభరణాల బంగారం ధర ₹ 350లు పెరిగి  ₹1,27,350 లకు చేరింది. అంటే 10 గ్రాముల మేలిమి బంగారం ధర ₹ 1,40,000లకు కేవలం ₹1,070ల దూరంలోనే ఉంది.

Gold Target  |    గత 10 రోజుల్లో బంగారం ధర పెరిగింది ఇలా…

Gold Target

డిసెంబర్  15, 2025        ₹1,35,380 (+1470)   ₹1,24,100 (+1350)

డిసెంబర్  16, 2025        ₹1,33,860 (–1520)      ₹1,22,70 0(-1400)

డిసెంబర్  17, 2025        ₹1,34,510 (+650)      ₹1,23,300 (+600)

డిసెంబర్  18, 2025        ₹1,34,840 (+330)      ₹1,23,600 (+300)

డిసెంబర్  19, 2025        ₹1,34,180 (-660)         ₹1,23,000 (-600)

డిసెంబర్  20, 2025        ₹1,34,180 (0)               ₹1,23,000 (0)

డిసెంబర్  21, 2025        ₹1,34,180 (0)               ₹1,23,000 (0)

డిసెంబర్  22, 2025        ₹13,6150 (+1970)    ₹12,4800 (+1800)

డిసెంబర్  23, 2025        ₹13,8550 (+2400)    ₹12,7000 (+2200)

డిసెంబర్  24, 2025        ₹13,8930 (+380)       ₹12,7350 (+350)

Gold Target  |   బంగారం స్పీడ్​ తగ్గదా?

Gold Target

వంబర్​, డిసెంబర్​ మాసాల్లో బంగారం ధర పెరుగుదల, తగ్గుదలను పరిశీలిస్తే.. ఇప్పట్లో బంగారం ధర స్పీడ్​ కు  బ్రేకులు లేనట్టే. అప్పుడప్పుడు స్వల్పంగా తగ్గినా.. ఆ తరువాత భారీగా ధర పెరుగుతుంది.   అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. (Spot Gold Rate) స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు (Ounce)సుమారు $ 4,494.61 వద్ద ట్రేడవుతోంది, ఇది క్రితం రోజుతో పోలిస్తే 0.12% నుండి 0.19% వరకు పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా దేశీయంగా కూడా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

Gold Target  |    డాలర్  .. రూపాయి బంతాట

అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ స్వల్పంగా బలహీనపడింది. డాలర్ ఇండెక్స్ (DXY) 0.05% తగ్గి 97.89 స్థాయికి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (America Fed Rate) వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల మధ్య డాలర్ విలువ గత 12 వారాల కనిష్ట స్థాయికి చేరువలో ఉంది.

 భారత రూపాయి బుధవారం డాలర్‌తో పోలిస్తే బలపడింది. ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి 12 పైసలు లాభపడి 89.51 వద్ద ట్రేడయ్యింది. ఆర్‌బీఐ (RBI) మార్కెట్లోకి సుమారు ₹3 లక్షల కోట్ల లిక్విడిటీని ప్రవేశపెట్టడం రూపాయి బలపడటానికి ప్రధాన కారణమైంది.

Gold Target  |  వెనిజులా షాక్​ ..

Gold Target

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (Brent Crude) ధర 0.29% నుండి 0.52% మేర పెరిగి బ్యారెల్‌కు $62.68 నుండి $62.70 మధ్య ఉంది. అమెరికా, -వెనిజులా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అమెరికా ఆర్థిక వృద్ధి గణాంకాలు ఈ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.

Gold Target  |   ద్రవ్యోల్బణం  దెబ్బ

 నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు తమ సొమ్ముకు రక్షణగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. దీనివల్ల బంగారం కొనుగోళ్లు పెరిగి ధరలు పెరుగుతాయి.  దేశీయంగా పెళ్లిళ్ల సీజన్: ప్రస్తుతం మన దేశంలో వివాహాల సీజన్ కావడంతో బంగారం వినియోగం మరియు డిమాండ్ గణనీయంగా పెరిగింది. డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల నగల దుకాణాలు ధరలను పెంచుతున్నాయి.

aLSO rEAD : Apco Discout :  ఆప్కో  భారీ మేళా Andhra Prabha SPL Story

Leave a Reply