మరోసారి షాకిచ్చిన బంగారం..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: మన దేశంలోని ఆడవారికి బంగారానికి (Gold) వీడిదీయలేని అవినాభావ సంబంధం ఉంది. పెళ్లుళ్లు, పండుగలు, శుభాకార్యాల్లో తప్పనిసరిగా బంగారు ఆభరణాలు ధరించాల్సిందే. అయితే, ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు అది దూరమైంది. గత ఐదేళ్లలో బంగారం విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూ పోయిందే తప్పా లోపలికి దిగొచ్చింది లేదు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.లక్ష దాటేసిన సంగతి తెలిసిందే.

ఇదే ట్రెండ్ కొనసాగితే రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత వారం రోజులుగా బంగారం ధరలు గణనీయంగా తగ్గడంతో మహిళలు సంతోషించి, బంగారం షాపుల వద్ద క్యూలు కట్టారు. కానీ, కొనుగోళ్ల జోరు కొనసాగుతుందనుకుంటుండగానే, ఇవాళ బంగారం ధరలు మరోసారి పెరగడం అందరికీ షాకిచ్చాయి.

దేశీయంగా హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్ రేటుపై రూ.600 పెరిగింది. అలాగే, 22 కారెట్ల గోల్డ్ రేటు రూ.500 పెరిగింది. దీంతో ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,750 కు చేరగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,300గా ఉంది. అలాగే, కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,26,000కు చేరింది. ఈ ధరలు ప్రాంతాల్ని, సమయాన్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లతో పాటు ఇతర కొన్ని అంశాలు ఇందుకు దోహదం చేస్తాయి. కాబట్టి కొనుగోలుదారులు ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలి.

Leave a Reply