Gold Rate | త‌గ్గిన ప‌సిడి రేటు

Gold Rate | త‌గ్గిన ప‌సిడి రేటు

  • బంగారం ప్రియుల‌కు ఆశాజ‌న‌కం

Gold Rate | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అంత‌ర్జాతీయంగా రూపాయి ప‌త‌న‌మ‌వుతున్న త‌రుణంలో బంగారం ధ‌ర‌లు పెరుగుతాయ‌ని ఊహించిన బంగారం ప్రియుల‌కు కాస్తా ఊర‌ట‌నిచ్చే విధంగా ప‌సిడి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఈ రోజు ఉద‌యం స్వ‌ల్పంగా పెరిగిన‌ప్ప‌టికీ సాయంత్రానికి త‌గ్గింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌(International market)లో ప‌సిడి ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టికీ మ‌న దేశంలో స్వ‌ల్పంగా త‌గ్గాయి.

బంగారం ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంద‌రూ భావించారు. అయితే ప‌ది గ్రాముల 24 క్యారేట్ల బంగారం(24 karat gold) ధ‌ర రూ.1,30,360 ప‌లికింది. నిన్నటి కంటే ఈ రోజు రూ.220లు త‌గ్గింది. ప‌ది గ్రాముల 22 క్యారేట్ల బంగారం ధ‌ర రూ.1,19,500లు ఉన్నాయి. నిన్నటి కంటే ఈ రోజు రూ.200 లు త‌గ్గింది.

Gold Rate

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో…
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సు (31.10 గ్రాములు)కు 17 డాలర్ల ( రూ.1530.01) మేర పెరిగి 4207 డాలర్ల (రూ.3,78,632.10) స్థాయికి పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక‌ పరిణామాల(Economic consequences)తో పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదు చేయగా.. ఇవాళ గోల్డ్ రేట్లు స్పల్పంగా త‌గ్గాయి.

24కే ప‌ది గ్రాముల బంగారం ధ‌ర‌లు
చెన్నై: రూ.1,31,580
ముంబై: రూ.1,30,590
న్యూఢిల్లీ: రూ.1,30,740
కోల్‌కతా: రూ.1,30,590
బెంగళూరు: రూ.1,30,590
హైదరాబాద్: రూ.1,30,590
విజయవాడ: రూ.1,30,590
కేరళ: రూ.1,30,590
పుణె: రూ.1,30,590
వడోదరా: రూ.1,30,640
అహ్మదాబాద్: రూ.1,30,640
22కే ప‌ది గ్రాముల బంగారం ధ‌ర‌లు
చెన్నై: రూ.1,20,610
బెంగళూరు: రూ.1,19,710
హైదరాబాద్: రూ.1,19,710
విజయవాడ: రూ.1,19,710
కేరళ: రూ.1,19,710
పుణె: రూ.1,19,710
వడోదరా: రూ.1,19,760;
అహ్మదాబాద్: రూ.1,19,760

click here to read దేవాలయాల అభివృద్ధికి నిధులు

click here to read more

Leave a Reply