ఆంధ్ర ప్ర‌భ వెబ్ డెస్క్ః భార‌త దేశంలో బంగారం కొనాలంటేనే భయపడేలా చేస్తోంది. రోజు రోజు బంగారం ధ‌ర‌లు అధిక‌మ‌వుతున్నాయి. గోల్డ్ రేట్‌.. ప్రస్తుతం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110,430లకి చేరింది. కాగా 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.101,228లకి చేరింది. బులియన్ మార్కెట్ ప్రకారం నిన్న‌టి కంటే బంగారం ధ‌ర ఈరోజు రూ.900లు పెరిగింది. అయితే.. బంగారంతోపాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. షేర్‌‌ మార్కెట్‌ నుంచి బులియన్‌ మార్కెట్‌కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతునే ఉన్నాయి. ప్ర‌స్తుతం కేజీ వెండి ధ‌ర రూ130,060ఉంది. మొన్న‌టి కంటే వెండి ధ‌ర రూ.2900లు పెరిగింది.

భారత దేశ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110,400ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.101,200గా ఉంది. వెండి కేజీ(silver kg) ధర రూ.130,030గా ఉంది.

విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Visakhapatnam)లో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110,400ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.101,200గా ఉంది. వెండి కేజీ ధర రూ.130,030గాఉంది.

ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల బంగార ధర 110,040, 22 క్యారెట్ల ధర రూ.100,870లుగా ఉంది. వెండి కిలో ధర రూ.129,600లుగా ఉంది.

ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల బంగార ధర110,230, 22 క్యారెట్ల ధర రూ.101,044లుగా ఉంది. వెండి కిలో ధర రూ.129,830లుగా ఉంది.

చెన్నై(Chennai)లో 24క్యారెట్ల బంగారం ధర రూ.110,550ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.101,338గా ఉంది. వెండి కిలో ధర రూ.130,200గా ఉంది.

Leave a Reply