పతనావస్థలో బంగారం ధర.. వారం రోజుల్లో రూ.12,062 తగ్గుదల

పతనావస్థలో బంగారం ధర.. వారం రోజుల్లో రూ.12,062 తగ్గుదల
ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్ : దీపావళి పండుగ వరకూ ఆకాశంలో తారాజువ్వలా దూసుకుపోయిన బంగారం ధర .. రికార్డు(record) స్థాయిలో పడిపోయింది. గత ఏడాది 56 శాతం పెరిగిన బంగారం ధర.. కేవలం ఈ పది రోజుల్లో బంగారం ధర 60 శాతం పడిపోయింది. అక్టోబరు 20న పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,32,770 లు పలికి.. అక్టోబరు 30న ( గురువారం) అందిన సాయంత్రం 5.00 గంటలకు అందిన సమాచారం మేరకు రూ.1,20,490లకు పడిపోయింది.
అంటే రూ.12,280లు తగ్గిపోయింది. ఇందుకు ప్రధాన కారణం. ఆగస్టు నుంచి అక్టోబర్ 20 వరకు బంగారం ధర రికార్డు స్థాయి(gold price at record level)కి చేరింది. ఇది 9 వారాల ర్యాలీలో చివరి దశ. ఇక లాభాలు పెరగటంతో.. మదుపుదారులు తమ లాభాలను క్యాష్ చేసుకోవటంతో.. బంగారం ధర అకస్మాత్తుగా పడిపోయింది. ఇది 5 ఏళ్లల్లో అతి పెద్ద సింగిల్-డే డ్రాప్ నకు దారితీసింది. ఇక అమెరికా చైనా టారిఫ్ వార్ చల్లపడింది.
అంతర్జాతీయ(international) రాజకీయ అనిశ్చితి సడలింది. రష్యా.. ఉక్రెయిన్ జగడం చల్లారింది. డాలర్ ఇండెక్స్ పెరిగింది. సేఫ్ హెవెన్(safe haven)కు తెరపడింది. ఫలితంగా బంగారం ధర నేలచూపు చూసింది. అక్టోబరు 22న ఉదయం నుంచి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,32,770లకు చేరింది. రూ.2,080లు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,900లు పెరిగి రూ.1,21,700లకు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1.560లు పెరిగి రూ.99,580లకు చేరింది. ఇక సామాన్యులు బంగారు ఆభరణాలను కొనలేని స్థితిలో ధర ఆకాశం వైపు దూసుకు పోతోందని అందరూ భావిస్తుంటుంటే.. అక్టోబరు 23న రూ.1,27,200లకు తగ్గింది.
అంటే ఈ రెండు రోజుల్లో రూ.5,570లకు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,100లు, 18 క్యారెట్ల బంగారం రూ.4,100లు తగ్గింది. ఇది మొదలు.. గురువారం (అక్టోబరు 30 వరకూ) బంగారం ధర పతనావస్థ ఇలా ఉంది. ఈ రోజు 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1,20,490 లకు చేరింది. అంటే రూ.1910ల ధర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,750లు తగ్గి రూ.1,10,450లకు చేరింది. 18 క్యారెట్ల(18 carat బంగారం ధర రూ.1430లు తగ్గి రూ.90,370లకు చేరింది.
గత వారం రోజులుగా మేలిమి బంగారం రోజు రోజుకూ ఎంత తగ్గిందంటే.. అక్టోబరు 24న 222లు, – అక్టోబర్ 25 న 2,313, అక్టోబర్ 26న 5,140 , అక్టోబర్ 27 5, 639, అక్టోబర్ 28న సుమారు 5,722, అక్టోబర్ 29న 6,222 , అక్టోబర్ 30న 5,480లు తగ్గి.. రూ.742లు పెరిగింది. మొత్తం ఈ వారం రోజుల్లో 12,062 చొప్సున బంగారం ధర తగ్గింది.
