Gold | పసిడి పరుగులు.. సరికొత్త రికార్డు !

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ పెరుగుతోంది. పెట్టుబడిదారులు గోల్డ్‌, సిల్వర్‌ను సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో దేశీయంగానూ పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లిలో 10 గ్రాముల మేలిమి బంగారం బుధవారం ఒక్కరోజే రూ.1650 మేరకు పెరిగి రూ.98,100కు చేరింది. 99.5శాతం స్వచ్ఛత కలిగిన పసిడి కూడా రూ.1650 పెరిగి రూ.97,650ని తాకింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లోనూ బంగారం 10 గ్రాములు రూ.97,700కు చేరగా, మరోవైపు వెండి ధరలూ భగ్గుమంటున్నాయి.

వివాహాల సీజన్‌ ప్రారంభం కాబోతుండంతో ఈ ధరలు లక్ష మార్కును దాటిపోయే అవకాశం ఉందని వాణిజ్యవర్గాలు పేర్కొంటున్నాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో బుధవారం ఇంట్రాడేలో ఔన్సు బంగారం 3318 డాలర్ల గరిష్టాన్ని తాకింది.

Leave a Reply