Gold | గంటల్లో సీన్ రివర్స్

Gold | గంటల్లో సీన్ రివర్స్
- ఇవాళ తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు
- తులం బంగారం ధర రూ.5020 తగ్గింపు
- కిలో వెండి ధర రూ.4600 డౌన్

Gold | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. వాటి రేట్లు ఏ రోజూ నిలకడగా ఉండటం లేవు. ఒక రోజు భారీగా పెరుగుతున్నాయి. అంతలోనే పతనమవుతున్నాయి. ఐదు రోజులుగా ధరలు పతనమవ్వగా.. బుధవారం కాస్త పెరిగాయి. గురువారం మళ్లీ ధరలు పడిపోయాయి. ఇక వెండి ధరలు కూడా అదే బాటలో నడిచాయి.

ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,54,420 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.1,59,440గా ఉండగా.. బుధవారంతో పోలిస్తే ధర రూ.5020 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,550గా ఇప్పుడు ఉంది. నిన్న ఇది రూ.1,46,150గా ఉండగా.. రూ.4600 తగ్గింది.

